రాష్ట్రంలో 4 రోజుల పాటు వర్షాలు

ABN , First Publish Date - 2022-07-19T15:00:27+05:30 IST

రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో కొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న

రాష్ట్రంలో 4 రోజుల పాటు వర్షాలు

అడయార్‌(చెన్నై), జూలై 18: రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో  కొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పశ్చిమ గాలుల దిశలో మార్పులు చోటుచేసుకోవడంతో వచ్చే నాలుగు రోజుల పాటు వర్షంపడే అవకాశం ఉందని చెన్నై వాతావారణ కేంద్రం తెలిపింది. ఈ నెల 20, 21వ తేదీల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 

Read more