Electric cables: రేపటి నుంచి ట్రాఫిక్‌లో మార్పులు
ABN , First Publish Date - 2022-08-19T15:31:16+05:30 IST
స్థానిక సెయింట్ థామ్సమౌంట్ ప్రాంతంలో విద్యుత్ కేబుళ్లు ఏర్పాటు చేస్తున్న కారణంగా ఈ నెల 20, 21 తేదీల్లో రాత్రి 11 నుంచి ఉదయం 5
ఐసిఎఫ్(చెన్నై), ఆగస్టు 18: స్థానిక సెయింట్ థామ్సమౌంట్ ప్రాంతంలో విద్యుత్ కేబుళ్లు ఏర్పాటు చేస్తున్న కారణంగా ఈ నెల 20, 21 తేదీల్లో రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్‌లో మార్పులు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆ వివరాలిలా...
- సెయింట్ థామ్సమౌంట్లో జీఎస్టీ రోడ్డు నుంచి వచ్చే వాహనాలు కత్తిపారా ఫ్లైవోవర్లో వెళ్లి, తిరువిక ఎస్టేట్ రోడ్డు మీదుగా గిండి బస్టాండు నుంచి అన్నాసాలై చేరుకోవాల్సివుంటుంది.
- పూందమల్లి నుంచి వచ్చే వాహనాలు యధావిధిగా వెళ్లొచ్చు.
- వడపళని నుంచి వచ్చే వాహనాలు ‘సిప్పెట్’ సిగ్నల్‌లో ఎడమవైపు తిరిగి, తిరువిక ఎస్టేట్ రోడ్డు మీదుగా గిండి బస్టాండుకు వచ్చి అన్నాసాలై వెళ్లాల్సి వుంటుంది.