Reservation of trains: రేపటి నుంచి సంక్రాంతి రైళ్ల రిజర్వేషన్‌

ABN , First Publish Date - 2022-09-11T16:31:40+05:30 IST

సంక్రాంతి(Sankranti) రైళ్ల రిజర్వేషన్లు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. చెన్నై, శివారు ప్రాంతాల్లో నివసించే వారు దీపావళి, సంక్రాంతి

Reservation of trains: రేపటి నుంచి సంక్రాంతి రైళ్ల రిజర్వేషన్‌

ఐసిఎఫ్‌(చెన్నై), సెప్టెంబరు 10: సంక్రాంతి(Sankranti) రైళ్ల రిజర్వేషన్లు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. చెన్నై, శివారు ప్రాంతాల్లో నివసించే వారు దీపావళి, సంక్రాంతి పండుగలకు సొంతూళ్లకు వెళ్లడం జరుగుతోంది. ఆ ప్రకారం, వచ్చే జనవరి 14వ తేది బోగి పండుగ ప్రారంభమై 17వ తేది వరకు సంక్రాంతి పండుగ జరుపుకోనున్నారు. వరుస సెలవులు రావడంతో సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్ధం ఈ నెల 12వ తేది నుంచి రిజర్వేషన్‌లను దక్షిణ రైల్వే ప్రారంభించనుంది. ఇదివరకే దీపావళి(Diwali) రైళ్ల టిక్కెట్ల రిజర్వేషన్లు ముగియగా, జనవరి 10వ తేది ప్రయాణించే వారు 12వ తేది రిజర్వేషన్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Read more