రేపు నగరానికి ద్రౌపది ముర్ము

ABN , First Publish Date - 2022-07-01T13:06:26+05:30 IST

ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము శనివారం నగరానికి రానున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు, పుదుచ్చేరిలో పర్యటించనున్న ఆమె.. అన్నాడీఎంకే,

రేపు నగరానికి ద్రౌపది ముర్ము

ప్యారీస్‌(చెన్నై), జూన్‌ 30: ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము శనివారం నగరానికి రానున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు, పుదుచ్చేరిలో పర్యటించనున్న ఆమె.. అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే, టీఎంసీ, ఎన్నార్‌ కాంగ్రెస్‏లకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలను కలుసుకొని మద్దతు కోరనున్నారు. ఆమె పర్యటన సందర్భంగా రెండు రాష్ట్రాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఆమె పర్యటనను కేంద్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర నేతలు పర్యవేక్షించనున్నారు. కాగా, బుధవారం ఢిల్లీలో ద్రౌపది ముర్మును టీఎంసీ అధ్యక్షుడు జీకే వాసన్‌ కలుసుకొని మద్దతు ప్రకటించారు.

Read more