Alagiri: గవర్నర్‌ను రీకాల్‌ చేయాలి

ABN , First Publish Date - 2022-08-27T16:29:25+05:30 IST

రాష్ట్ర ప్రజల సంక్షేమానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని రీకాల్‌ చేయాలని టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి(TNCC President KS

Alagiri: గవర్నర్‌ను రీకాల్‌ చేయాలి

                               - టీఎన్‌సీసీ నేత అళగిరి డిమాండ్‌


చెన్నై, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజల సంక్షేమానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని రీకాల్‌ చేయాలని టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి(TNCC President KS Alagiri) డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన జారీ చేస్తూ ఢిల్లీలో గవర్నర్‌ రవి తిరువళ్లువర్‌ విగ్రహావిష్కరణ సభలో పాల్గొని తాను ఆర్‌ఎస్ఎస్‌ వీరాభిమానినని ప్రకటించుకున్నారని, అంతటితో ఆగకుండా జీయూ పోప్‌ తిరుక్కురళ్‌ అనువాదంలో ఉద్దేశ పూర్వకంగా భక్తి అంశాన్ని తొలగించారని, చరిత్రను వక్రీకరించే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. గవర్నర్‌(Governor) పదవిని చేపట్టినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను పెండింగ్‌లో ఉంచుతున్నారని, తమిళులకు, తమిళ భాషకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని అళగిరి విమర్శించారు. ప్రజలచేత ఎన్నికైన ప్రభుత్వానికి అడ్డుపుల్లలు వేయడమే గవర్నర్‌ ప్రధాన లక్ష్యంగా ఉంటోందని, ఇలాంటి ప్రజా వ్యతిరేక గవర్నర్‌ను పదవి నుంచి తొలగించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Read more