ఎర్రకోట వద్ద తిరంగా బైక్‌ ర్యాలీ

ABN , First Publish Date - 2022-08-04T10:55:34+05:30 IST

జాతీయవాద భావనే దేశ అస్తిత్వమని, స్వాతంత్య్ర సంగ్రామం, జాతి నిర్మాణంలో త్రివర్ణ పతాకం పాత్ర స్ఫూర్తిదాయకమని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు.

ఎర్రకోట వద్ద తిరంగా బైక్‌ ర్యాలీ

కాంగ్రెస్‌ ఎంపీల గైర్హాజరు

న్యూఢిల్లీ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : జాతీయవాద భావనే దేశ అస్తిత్వమని, స్వాతంత్య్ర సంగ్రామం, జాతి నిర్మాణంలో త్రివర్ణ పతాకం పాత్ర స్ఫూర్తిదాయకమని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. స్వాత్రంత్య దినోత్సవ అమృత మహోత్సవాల్లో భాగంగా ఢిల్లీలో బుధవారం నిర్వహించిన తిరంగా బైక్‌ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రారంభానికి ముందు వెంకయ్య మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో త్రివర్ణ పతాకం స్ఫూర్తిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు కేంద్ర మంత్రులు, ఎంపీలతోపాటు ప్రతీ భారతీయుడు కృషి చేయాలని కోరారు. ‘హర్‌ ఘర్‌ తిరంగా’ (ఇంటింటికీ మువ్వన్నెల) కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయునిపై ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజవయంతం చేసే విషయంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చేస్తున్న కృషిని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. కాగా, ఎర్రకోట నుంచి ఇండియా గేట్‌ వరకూ సాగిన బైక్‌ ర్యాలీలో కేంద్రమంత్రులు ప్రహ్లాద్‌ జోషి, జి.కిషన్‌ రెడ్డి, పీయూష్‌ గోయల్‌, అనురాగ్‌ ఠాకూర్‌, గజేంద్ర సింగ్‌ షెకావత్‌, స్మృతి ఇరానీ, అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, పలువురు ఎంపీలతోపాటుపెద్దసంఖ్యలో ఔత్సాహికులు పాల్గొన్నారు. కాంగ్రె్‌సతోపాటు పలు ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు ర్యాలీకి దూరంగా ఉన్నారు. 

Updated Date - 2022-08-04T10:55:34+05:30 IST