‘కోటా’ కోచింగ్‌ సెంటర్‌లో ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-12-13T02:43:37+05:30 IST

రాజస్థాన్‌లోని కోటాలో పోటీ పరీక్షల కోచింగ్‌ కేంద్రంలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు విద్యార్థులు బిహార్‌కు చెందిన అంకుష్‌(16), ఉజ్వల్‌(17)

‘కోటా’ కోచింగ్‌ సెంటర్‌లో ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య

కోచింగ్‌లో ఒత్తిడి తట్టుకోలేకే!

జైపూర్‌, డిసెంబరు 12: రాజస్థాన్‌లోని కోటాలో పోటీ పరీక్షల కోచింగ్‌ కేంద్రంలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు విద్యార్థులు బిహార్‌కు చెందిన అంకుష్‌(16), ఉజ్వల్‌(17) ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష కోసం శిక్షణ పొందుతున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన మరో విద్యార్థి ప్రణవ్‌(18) నీట్‌ కోచింగ్‌ తీసుకుంటున్నారు. వీరు ముగ్గురూ వారి గదుల్లోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే వీరి ఆత్మహత్యకు సంబంధించి ఎటువంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదు. కానీ, కోచింగ్‌లో ఒత్తిడి తట్టుకోలేకే వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. గతంలోనూ ఈ కోచింగ్‌ సెంటర్‌లో పలువురు విద్యార్థులు ఇలా బలవన్మరణాలకు పాల్పడ్డారు. దీంతో సెంటర్‌ నిర్వాహకులు ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు రాజస్థాన్‌ ప్రభుత్వం కూడా కోచింగ్‌ కేంద్రాలను నియంత్రించేందుకు ఓ కమిటీని నియమించింది. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించే విధంగా ఆయా కేంద్రాలు అనుసరించాల్సిన విధానానికి సంబంధించి ముసాయిదాను రూపొందించాల్సిందిగా ఆ కమిటీని ఆదేశించింది.

Updated Date - 2022-12-13T02:43:39+05:30 IST