Palakkad సుబైర్ హత్య కేసులో ముగ్గురు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల అరెస్ట్
ABN , First Publish Date - 2022-04-20T16:23:52+05:30 IST
గత వారం పాలక్కాడ్లో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డిపిఐ) కార్యకర్త పి సుబైర్ హత్యకు సంబంధించి ముగ్గురు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్తలను కేరళ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు...

పాలక్కాడ్ : గత వారం పాలక్కాడ్లో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డిపిఐ) కార్యకర్త పి సుబైర్ హత్యకు సంబంధించి ముగ్గురు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్తలను కేరళ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.అరెస్టయిన ముగ్గురిలో కె రమేష్, ఆరుముఖన్, శరవణన్లు ఉన్నారు. వీరు హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ సఖ్రే తెలిపారు.2021 లో జరిగిన ఆర్ఎస్ఎస్ నాయకుడు సంజిత్ హత్యకు ప్రతీకారంగా సుబైర్ హత్య చేశారని పోలీసులు చెప్పారు. రమేష్ సంజిత్కు అత్యంత సన్నిహితుడని, సుబైర్ హత్యకు ప్రధాన కుట్రదారుడని పోలీసు అధికారి తెలిపారు.శుక్రవారం సుబైర్ హత్య జరిగిన 24 గంటల లోపే సుబైర్ హత్యకు ఆర్ఎస్ఎస్ కారణమని ఎస్డిపిఐ ఆరోపించింది.