Maharashtra: నాసిక్‌లో గంట వ్యవధిలో మూడుసార్లు భూ ప్రకంపనలు
ABN , First Publish Date - 2022-08-17T13:16:34+05:30 IST
మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో కేవలం గంట వ్యవధిలో మూడు సార్లు భూకంపం సంభవించింది....

నాసిక్ (మహారాష్ట్ర): మహారాష్ట్రలోని నాసిక్ లో(Maharashtras Nashik) కేవలం గంట వ్యవధిలో మూడు సార్లు భూకంపం(earthquakes) సంభవించింది. నాసిక్ నగరానికి 16 కిలోమీటర్ల సమీపంలోని దిందోరి తాలూకాలో మంగళవారం రాత్రి మూడు సార్లు భూప్రకంపనలు( earthquake tremors) సంభవించాయి. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు దిందోరి, పరిసర గ్రామాల్లో మూడుసార్లు భూమి కంపించింది. దీంతో పలు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.4 గా నమోదైందని నాసిక్ జిల్లా డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ(Nashik District Disaster Management Authority)వెల్లడించింది. దిందోరి తాలూకాలోని దిందోరి, మడకజాంబ, నీల్ వండి, జాంబుట్కే, ఉమ్రాలే, టాలేగాం గ్రామాల్లో భూప్రకంపనలు సంభవించాయని అధికారులు చెప్పారు.
జాంబుట్కే ప్రాంతంలో భూమి అధికంగా కంపించిందని స్థానిక శివసేన నాయకుడు విఠల్ రావు చెప్పారు. భూకంపంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని, ప్రజలు భయాందోళనలు చెందవద్దని నాసిక్ జిల్లా డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ అధికారులు చెప్పారు.