యుద్ధం తర్వాత భారత్ ప్రియురాలిని వివాహం ఆడనున్న Ukrainian సైనికుడు

ABN , First Publish Date - 2022-04-11T18:00:35+05:30 IST

రష్యా యుద్ధం అనంతరం ఓ ఉక్రేనియన్ సైనికుడు భారతదేశానికి చెందిన తన ప్రియురాలిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాడు....

యుద్ధం తర్వాత భారత్ ప్రియురాలిని వివాహం ఆడనున్న Ukrainian సైనికుడు

కైవ్ (ఉక్రెయిన్): రష్యా యుద్ధం అనంతరం ఓ ఉక్రేనియన్ సైనికుడు భారతదేశానికి చెందిన తన ప్రియురాలిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాడు.ఉక్రెయిన్ దేశ సైనిక విభాగంలో సైనికుడిగా పనిచేస్తున్న ఓ యువకుడు భారతదేశానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు.సైనికుడు తన ప్రియురాలి ప్రేమకు గుర్తుగా గొంతు, ఛాతీపై వేద మంత్రాలను టాటూగా వేయించుకున్నాడు.యుద్ధం వల్ల విధ్వంసంతో పాటు పలువురు మరణిస్తుండగా, యుద్ధం ముగిశాక తాను ప్రేమించిన భారత యువతిని పెళ్లి చేసుకుంటానని ఉక్రెయిన్ సైనికుడు చెప్పారు. రష్యా సైనిక దాడితో విధ్వంసం మధ్య ఓ సైనికుడు యుద్ధం అనంతరం తన ప్రేయసిని వివాహమాడి ఆనందంగా జీవితం గడపాలని భావిస్తుండటం విశేషం. ఉక్రెయిన్‌లో యుద్ధం మధ్య అనేక ప్రేమ కథలు వెలుగు చూస్తున్నాయి.

Updated Date - 2022-04-11T18:00:35+05:30 IST