Anand Mahindra : ఈ బొమ్మ మనకు ఏం నేర్పుతుంది? : ఆనంద్ మహీంద్ర

ABN , First Publish Date - 2022-07-22T01:42:17+05:30 IST

అమెరికా అంతరిక్ష పరిశోధక సంస్థ నాసా (NASA) 2014లో షేర్ చేసిన

Anand Mahindra : ఈ బొమ్మ మనకు ఏం నేర్పుతుంది? : ఆనంద్ మహీంద్ర

న్యూఢిల్లీ : అమెరికా అంతరిక్ష పరిశోధక సంస్థ నాసా (NASA) 2014లో షేర్ చేసిన ఫొటోను మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర తాజాగా షేర్ చేశారు. అంగారక గ్రహం నుంచి భూమిని చూపించే ఈ చిత్రం మనకు అణకువను నేర్పుతుందని పేర్కొన్నారు. 


నాసా ఈ ఫొటోను షేర్ చేస్తూ, మార్షియన్ నైట్ స్కైలో ఇతర నక్షత్రాల కన్నా ఎక్కువ ప్రకాశవంతంగా భూమి (Earth) ఉందని పేర్కొంది. దీనిని క్యూరియాసిటీ రోవర్ (Curiosity Rover) చిత్రీకరించింది. 


ఈ ఫొటోను ఆనంద్ మహీంద్ర షేర్ చేసి, ‘‘ఈ ఫొటో మనకు నేర్పేది ఏదైనా ఉందీ అంటే అది అణకువ’’ అని పేర్కొన్నారు. 


Updated Date - 2022-07-22T01:42:17+05:30 IST