Work from Home కి అత్యుత్తమ నగరాలివే.. అధ్యయనంలో ఆసక్తికర అంశాలు..
ABN , First Publish Date - 2022-05-27T00:53:21+05:30 IST
కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు సంభవించాయి. అందులో వర్క్ ఫ్రం హోం ప్రధానమైనది.

న్యూయార్క్ : కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు సంభవించాయి. అందులో వర్క్ ఫ్రం హోం ప్రధానమైనది. దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న ఈ విధానంతో ఉద్యోగుల జీవన శైలిలో మార్పులు వచ్చాయి. ఉద్యోగులు అలవాట్లు, పనిస్వభావంలో వైవిధ్యం కనిపిస్తోంది. పని చేసే చోటు, పని విధానం అంశాల్లో ఉద్యోగుల స్వభావం మారిపోయింది. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గిపోవడంతో తిరిగి ఆఫీస్‌లకు రావాలని ఉద్యోగులను కంపెనీలు కోరుతున్నాయి. దీంతో వర్క్ ఫ్రం హోం చేయాలా.. లేక ఆఫీస్‌కి వెళ్లాలా అనే విషయంలో ఉద్యోగులు ఎటూతేల్చుకోలేకపోతున్నారు. మారిన ఉద్యోగుల వైఖరిని పరిగణలోకి తీసుకుంటూ మొబైల్ యాక్సెస్ టెక్నాలజీ కంపెనీ ‘కిసీ’ చేపట్టి అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వర్క్ ఫ్రం హోంకి, పని విధానానికి అత్యంత అనువైన, అత్యంత చెత్త నగరాల జాబితాను ప్రకటించింది. అవేంటో ఓ లుక్కేద్దాం...
వర్క్ ఫ్రం హోంకి అత్యుత్తమ నగరాలు..
1. సింగపూర్ (52.06 శాతం)
2. వాషింగ్టన్ (49.77 శాతం)
3. ఆస్టిన్ (45.51 శాతం)
4. బెర్న్ (44.86 శాతం)
5. జ్యూరిచ్ (44.86 శాతం)
6. జెనీవా (44.86 శాతం)
7. శాన్ ఫ్రాన్సిస్కో (44.76 శాతం)
8. బోస్టన్ (44.35 శాతం)
9. స్టాక్‌హోం (44.20 శాతం)
10. లివర్‌పూల్(43.50 శాతం).
శాతాన్ని బట్టి ఆయా నగరాల్లో వర్క్ ఫ్రం హోం ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలియజేస్తోంది.
ఉద్యోగులు అధికంగా శ్రమిస్తున్న టాప్-10 నగరాలివే..
ఉద్యోగులు పనిచేయాల్సిన దానికంటే ఎక్కువగా శ్రమించడం, అధిక సమయంపాటు పనిచేయడాన్ని ‘ఓవర్‌వర్క్(అధిక పని)’గా వర్ణిస్తారు. ఇలా ఎక్కువ శ్రమిస్తున్న ఉద్యోగులున్న నగరాల్లో దుబాయ్ ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో సిటీలను చూద్దాం..
1. దుబాయ్ (23.40 శాతం)
2. హాంగ్‌కాంగ్ (17.90 శాతం)
3. కౌలాలంపూర్ (17.10 శాతం)
4. సింగపూర్ (16.90 శాతం)
5. మోంటెవిడియో (16.30 శాతం)
6. టోక్యో (15.40 శాతం)
7. బ్యాంకాక్ (15.10 శాతం)
8. కేప్‌టౌన్ (14.80 శాతం)
9. లిస్బెన్ (14.70 శాతం)
10. బుడాపెస్ట్ (14.40 శాతం)
పని- జీవన సమతుల్యత ఈ నగరాల్లో బెస్ట్..
ఒక వ్యక్తి తన ఉద్యోగ, వ్యక్తిగత జీవితానికి సమప్రాధాన్యత ఇవ్వడాన్ని ‘పని-జీవన సమతుల్యత’గా పరిగణిస్తున్నారు. ఈ విషయంలో ఏయే నగరాలు టాప్ 10లో ఉన్నాయో చూద్దాం..
1. ఓస్లో (100 శాతం)
2. బెర్న్ (99.46 శాతం)
3. హెల్సింకి (99.24 శాతం)
4. జ్యూరిచ్ (96.33 శాతం)
5. కొపెన్‌హగెన్ (96.21 శాతం)
6. జెనీవా (95.82 శాతం)
7. ఒట్టవా (95.51 శాతం)
8. సిడ్నీ (94.04 శాతం)
9. స్టట్గర్ట్ (93.79 శాతం)
10. మ్యూనిచ్ (93.65 శాతం)