అప్పుడు చనిపోవాలనుకుంది... ఇప్పుడేమో కంపెనీ బాస్

ABN , First Publish Date - 2022-06-08T01:44:20+05:30 IST

అతి చిన్న వయస్సులోనే ఎడెల్వీస్ సీఈఓగా నియమితులైన రాధికా గుప్తా... గతంలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.

అప్పుడు చనిపోవాలనుకుంది...   ఇప్పుడేమో కంపెనీ బాస్

హైదరాబాద్ : అతి చిన్న వయస్సులోనే ఎడెల్వీస్ సీఈఓగా నియమితులైన రాధికా గుప్తా... గతంలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. అందుకు కారణం... ఉద్యోగం లేకపోవడమే. కానీ... ఆ తర్వాత... మెకెన్సీలో ఉద్యోగం రావడంతో ఆమె జీవితం మలుపు తిరిగింది. ఈ రోజు అమె... దేశంలో అత్యంత పిన్న వయస్కులైన సీఈఓల్లో ఒకరు కావడం విశేషం. రాధికా గుప్తా. ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా 33 ఏళ్ల వయసులోనే బాధ్యతలు చేపట్టారు. ఒక సమయంలో ఉద్యోగం రాక ఆత్మహత్యాయత్నం చేసిన రాధికా... ప్రస్తుతం దేశంలో డైనమిక్ మ్యూచువల్ ఫండ్ హౌసెస్‌లో ఒకటైన అతి చిన్న వయస్సులోనే ఎడెల్వీస్ సీఈఓగా నియమితులైన రాధికా గుప్తా... గతంలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. కు సీఈఓ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.


పుట్టుకతోనే వంకర మెడతో జన్మించిన రాధికా గుప్తాకు కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. తన అవయవలోపం కారణంగా ఉద్యోగ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ సమయంలోనే 22 ఏళ్ల వయస్సులో... రాధికా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు.  కానీ స్నేహితురాలు కాపాడటంతో బతికానని, తనని మానసిక వైద్యనిపుణుల దగ్గరకు తీసుకెళ్లి రక్షించినట్లు రాధిగా గుప్తా వెల్లడించారు. ఇలా స్నేహితురాలి సాయంతో బతికిన రాధికా ఆ తర్వాత ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈవో ఎలా అయ్యారంటే... ఆమె మాటల్లోనే...  


‘నేను వంకర మెడతో పుట్టాను. ప్రతి స్కూల్‌లో నేను ఓ కొత్త విద్యార్థినే. ఎందుకంటే నాన్న దౌత్యవేత్త కావడంతో నేను నైజీరియాకు వెళ్లకు ముందు పాకిస్తాన్‌లో, న్యూయార్క్‌లో, ఢిల్లీలో పెరిగాను. నా స్కూల్‌లో స్నేహితులు ఎగతాళి చేసేవారు. మా అమ్మ కూడా అదే స్కూల్‌లో పనిచేసేవారు. తను చాలా అందంగా ఉంటుంది. అమ్మతో పోల్చే సమయంలో నీనెంత అందహీనంగా ఉన్నానో చెప్పేవారు. ఆ సమయంలో నా కాన్ఫిడెన్స్ అంతా దెబ్బతినేది. అవయవలోపంతో నా చిన్నతనమంతా అభద్రతాభావంతోనే పెరిగాను. వీటి నుంచి బయటపడేందుకు ఉద్యోగం చేయాలనుకున్నా. కానీ నా దరఖాసులు తిరస్కారానికి గురయ్యేవి. ఆ క్రమంలోనే... 22 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. కిటికీలో నుంచి చూస్తూ కిందకి దూకేశాను. నా స్నేహితురాలు కాపాడింది. అయితే... ఆ తర్వాత చక్రాల కూర్చికే పరిమితం కావాల్సి వచ్చింది.


కాగా... నా మానసిక ఒత్తిడికి చికిత్సనందించారు. జీవితంలో ఏదీ సాధించలేనేమో అనుకుంటున్న ఆ  సమయంలో... నాకు ఎదురొచ్చిన ఓ అవకాశం నా జీవితాన్నే మార్చేసింది. కేవలం ఆ ఒక్క కారణంతోనే నేను ఆసుపత్రి నుంచి బయటికి వచ్చాను. నాకు జాబ్ ఇంటర్వ్యూ ఉందని చెప్పి ఆసుపత్రి నుంచి బయటికి వచ్చాను. అదే నా చివరి ప్రయత్నం అనుకున్నా కూడా. ఆ ఉద్యోగమే నా జీవితాన్ని మలుపు తిప్పింది. నాకు మెకెన్సీలో ఉద్యోగం వచ్చింది. 


అప్పటి నుంచి నా జీవితానికి ఒక మార్గం, గమ్యం దొరికాయి.  కానీ మూడేళ్ల తర్వాత... 2008 లో తీవ్ర ఆర్థికసంక్షోభం తలెత్తింది. దానినుంచి కోలుకున్న తర్వాత... నేను దేశం మారాలనుకున్నా. పాతికేళ్ళ వయసులో భారత్‌కు వచ్చాను. భారత్‌కు వచ్చిన తర్వాత నా భర్త, ఫ్రెండ్‌తో సొంతంగా అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థను ఏర్పాటు చేశాను. కొన్నేళ్ల తర్వాత... మా కంపెనీని ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేసింది. నేను అప్పుడే కార్పొరేట్ నిచ్చెన ఎక్కాను. ఏదైనా అవకాశం వస్తే నేను ముందుండేదాన్ని. అయితే... ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్‌కు కొత్త సీఈఓను ఎంపిక చేసుకునే సమయంలో మాత్రం నేను వెనుకడగు వేశాను. అయితే నా భర్త ప్రోత్సహించారు. ఆ ఉద్యోగానికి నేనే బెస్ట్ పర్సన్ అని చెప్పారు. కొన్ని నెలల తర్వాత 33 ఏళ్లలోనే దేశంలోనే అతి పిన్న వయస్కులైన సీఈఓల్లో ఒకరిగా బాధ్యతలు చేపట్టాను. ఒకప్పుడు నేను నా లోపాన్ని చూసుకుని బాధపడుతుండేదాన్ని.


కానీ నాలా ఎవరూ బాధపడకూడదన్న సంకల్సంతో ‘లిమిట్‌లెస్’ అనే పుస్తకాన్ని రాశాను’ అంటూ రాధిగా గుప్తా తన జీవనయానాన్ని వివరించారు. నిజమే... ఆమె జీవితం మరెందరికో స్ఫూర్తినిస్తుంది కదూ. అందుకే... ‘జీవితంలో ఎప్పుడూ నిరాశకు గురికావద్దు. వెనుకడుగు వేయొద్దు. ప్రతీ ఓటమీ ఓ పాఠమే. వాటి స్పూర్తితోనే ముందుకెళ్ళాలి. అప్పుడు విజయం మన సొంతమవుతుంది’ అని చెబుతుంటారు. హ్యాట్సాఫ్ టు రాధికా గుప్తా. 

Read more