రూపాయి పడిపోలేదు.. డాలర్‌ బలపడుతోందంతే..!

ABN , First Publish Date - 2022-10-17T08:49:12+05:30 IST

డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ బలహీనపడుతుండడాన్ని భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమర్థించుకున్నారు.

రూపాయి పడిపోలేదు.. డాలర్‌ బలపడుతోందంతే..!

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలు

వాషింగ్టన్‌. అక్టోబరు 16: డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ బలహీనపడుతుండడాన్ని భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమర్థించుకున్నారు. నిజానికి రూపాయి విలువ పడిపోవడం లేదని, డాలర్‌ విలువ పెరుగుతున్నందున తగ్గుతున్నట్టు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. భారత అర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉందని, ఇతర దేశాలతో పోల్చితే ద్రవ్యోల్బణం అదుపులో ఉందని చెప్పారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌), ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల్లో పాల్గొన్న అనంతరం శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డాలర్‌ విలువ అడ్డులేకుండా పెరుగుతోందని అందువల్లనే రూపాయి బలహీనంగా కనిపిస్తోందని చెప్పారు. ఇతర దేశాల కరెన్సీలతో పోల్చితే రూపాయి బలంగానే ఉందని అన్నారు.

Updated Date - 2022-10-17T08:49:12+05:30 IST