అద్దెకుంటున్న వ్యక్తిని చంపి.. మూడు ముక్కలు చేసిన యజమాని!

ABN , First Publish Date - 2022-12-16T01:07:44+05:30 IST

ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తిని దారుణంగా హతమార్చాడో యజమాని. కారణం అతనికి కోటి రూపాయల డబ్బు రావడమే! ఆ డబ్బుపై కన్నేసిన యజమాని.. అతన్ని క్రూరంగా హత్య చేసిన ఘటన

అద్దెకుంటున్న వ్యక్తిని చంపి.. మూడు ముక్కలు చేసిన యజమాని!

కోటి రూపాయలు కొట్టేసేందుకు ఘాతుకం

మృతుడి స్నేహితుల ఫిర్యాదుతో వెలుగులోకి

ఘజియాబాద్‌, డిసెంబరు 15: ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తిని దారుణంగా హతమార్చాడో యజమాని. కారణం అతనికి కోటి రూపాయల డబ్బు రావడమే! ఆ డబ్బుపై కన్నేసిన యజమాని.. అతన్ని క్రూరంగా హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. ఘజియాబాద్‌లోని మోదీనగర్‌లో ఉమేశ్‌ శర్మ ఇంట్లో అంకిత్‌ ఖోకర్‌ నివసిస్తున్నారు. లఖ్‌నవూ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నారు. కొన్నేళ్ల కిందట తల్లిదండ్రులు మరణించడంతో ఒంటరిగా అద్దె ఇంట్లో ఉంటున్నారు. భాగ్‌పట్‌లో తనకు వారసత్వంగా వచ్చిన భూమిని ఇటీవల విక్రయించగా రూ.కోటి వచ్చాయి. ఆ సొమ్ముపై ఉమేశ్‌ శర్మ కన్నేశాడు. అక్టోబరు 6న అంకిత్‌ను హత్య చేసి, మూడు ముక్కలుగా నరికాడు. వాటిని అల్యూమినియం పేపర్‌లో ప్యాక్‌ చేశాడు. ఒక భాగాన్ని ముజఫర్‌నగర్‌లోని ఖటౌలి వద్ద కాలువలో పడేశాడు. మరో భాగాన్ని ముసోరి కాలువలో విసిరేశాడు. మూడో భాగాన్ని ఓ ఎక్స్‌ప్రెస్‌ వే పక్కన పడేసినట్లు పోలీసులు తెలిపారు.

కొన్ని వారాల పాటు అంకిత్‌ ఫోన్‌ కాల్స్‌కు స్పందించకపోవడంతో అతని స్నేహితులకు అనుమా నం వచ్చింది. ఆ తర్వాత అతని ఫోన్‌ నంబరు నుంచి మెసేజ్‌లు వచ్చినా.. అవి అంకిత్‌ శైలికి భిన్నంగా ఉండడంతో అనుమానించి పోలీసులను ఆశ్రయించారు. వా రు విచారణ చేపట్టి.. ఇంటి యజమాని ఉమేశ్‌ శర్మే అంకిత్‌ను హత్య చేసినట్లు నిర్ధారించారు. బుధవారం అతన్ని అరెస్టు చేశారు. అంకిత్‌ ఏటీఎం కార్డును ఉపయోగించి పలు దఫాలుగా రూ.20 లక్షలు విత్‌డ్రా చేసినట్లు పోలీసులు తెలిపారు. మరిన్ని డబ్బులు ఉత్తరాఖండ్‌లో విత్‌డ్రా చేయాలంటూ ఏటీఎం కార్డును ఉమేశ్‌ తన స్నేహితుడైన పర్వేశ్‌కు ఇచ్చాడు. అలాగే పోలీసుల విచారణను తప్పుదోవ పట్టించేందుకు అంకిత్‌ ఫోన్‌ను కూడా అతనికి ఇచ్చి పంపాడు. ఉమేశ్‌తో పాటు పర్వేశ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - 2022-12-16T08:08:24+05:30 IST