‘ఆకలి సూచీ’ నివేదిక బాధ్యతారహితం
ABN , First Publish Date - 2022-10-17T08:51:43+05:30 IST
ప్రపంచ ఆకలి సూచీ (జీహెచ్‌ఐ)లో భారత్ 107వ స్థానానికి పడిపోయిందని చెప్పడం పట్ల ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్‌జేఎం) తీవ్రంగా మండిపడింది.
భారత్‌ను అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నం: ఆర్‌ఎస్‌ఎస్
న్యూఢిల్లీ, అక్టోబరు 16: ప్రపంచ ఆకలి సూచీ (జీహెచ్‌ఐ)లో భారత్ 107వ స్థానానికి పడిపోయిందని చెప్పడం పట్ల ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్‌జేఎం) తీవ్రంగా మండిపడింది. సూచీని రూపొందించిన సంస్థలు పూర్తిగా బాధ్యతారహితంగా వ్యవహరించాయని ఆరోపించింది. ప్రపంచ దేశాల ముందు భారత్‌ను అప్రతిష్ఠపాలు చేసేందుకే ఈ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని ఎస్‌జేఎం ధ్వజమెత్తింది.