రాత్రిపూట వేడి చంపేస్తోంది!

ABN , First Publish Date - 2022-08-10T06:27:25+05:30 IST

రాత్రి వేళల్లో పెరుగుతున్న వేడి వల్ల మనిషి క్రమత్వం దెబ్బతిని ఆయువు తగ్గుతోందని నార్త్‌ కరోలినా యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. రాత్రి సమయాల్లో వేడి నిద్రను దెబ్బతీసి హృదయ సంబంధ, మానసిక సమస్యలతో పాటు అనేక దీర్ఘకాలిక వ్యాధులకు

రాత్రిపూట వేడి చంపేస్తోంది!

బీజింగ్‌, ఆగస్టు 9: రాత్రి వేళల్లో పెరుగుతున్న వేడి వల్ల మనిషి క్రమత్వం దెబ్బతిని ఆయువు తగ్గుతోందని నార్త్‌ కరోలినా యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. రాత్రి సమయాల్లో వేడి నిద్రను దెబ్బతీసి హృదయ సంబంధ, మానసిక సమస్యలతో పాటు అనేక దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతోందని, దీని వల్ల మనుషులు మరణించే ముప్పు వచ్చే శతాబ్ద కాలంలో ఆరు రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని వారు చెప్పారు. 2100 సంవత్సరం నాటికి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 40 డిగ్రీల వరకు పెరుగుతాయని వారు వెల్లడించారు. తూర్పు ఆసియాలోని 28 ప్రధాన నగరాలలో ఈ ప్రభావం అధికంగా ఉంటుందని వారు చెప్పారు. రాత్రి వేళలో పెరిగే వేడి మనిషి ఆయుర్దాయాన్ని తగ్గిస్తుందని, దీని వల్ల చిన్న వయసులో మరణించే వారి సంఖ్య అధికం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. చైనా, దక్షిణ కొరియా, జపాన్‌ దేశాల్లో చేసిన పరిశోధనలో ఇలాంటి మరణాలు అధికంగా ఉన్నట్లు తేలిందన్నారు.

Updated Date - 2022-08-10T06:27:25+05:30 IST