ఉత్తరాఖండ్‌లో ఘోరం
ABN , First Publish Date - 2022-10-07T10:14:54+05:30 IST
ఉత్తరాఖండ్‌లో ఘోరం జరిగింది. పెళ్లి బృందం బస్సు లోయలో పడి 33 మంది మృతిచెందారు.
లోయలో పడిన పెళ్లి బస్సు
33 మంది మృతి, 19మందికి గాయాలు
పౌడి గఢ్వాల్, అక్టోబరు 6: ఉత్తరాఖండ్‌లో ఘోరం జరిగింది. పెళ్లి బృందం బస్సు లోయలో పడి 33 మంది మృతిచెందారు. 19 మందికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన పౌడి గఢ్వాల్ జిల్లాలో జరిగింది. మంగళవారం సాయంత్రం ఓ బస్సు 50 మంది పెళ్లి బృందంతో హరిద్వార్ జిల్లాలోని లాల్‌దంగ్ నుంచి బీరోంఖల్‌లోని కందా గ్రామానికి వెళ్తుండగా సిమ్రి గ్రామ సమీపంలోని 500 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. గమనించిన గ్రామస్థులు సెల్‌ఫోన్‌ల టార్చిలైట్‌ల వెలుతురులోనే సహాయక చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలంలో 31 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. 21 మందికి గాయాలు కావడంతో చికిత్స కోసం దగ్గరలోని ఆస్పత్రులకు తరలించగా, వారిలో మరో ఇద్దరు మృతిచెందారు. ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కొట్ద్వార్‌లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.