‘Tamilnadu Day’లో ప్రాచీన వస్తువుల ప్రదర్శన

ABN , First Publish Date - 2022-07-19T15:36:49+05:30 IST

తమిళనాడు డే సందర్భంగా కలైవానర్‌ అరంగం మొదటి అంతస్తు హాల్లో తమిళుల ప్రాచీన నాగరికతను తెలిపేలా పురావస్తు తవ్వకాల్లో లభించి

‘Tamilnadu Day’లో ప్రాచీన వస్తువుల ప్రదర్శన

చెన్నై, జూలై 18 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు డే సందర్భంగా కలైవానర్‌ అరంగం మొదటి అంతస్తు హాల్లో తమిళుల ప్రాచీన నాగరికతను తెలిపేలా పురావస్తు తవ్వకాల్లో లభించిన ప్రాచీన వస్తువులతో ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్‌ ఈ నెల 20 వరకు నిర్వహించనున్నారు. మంత్రులు తంగం తెన్నరసు, స్వామినాథన్‌ తదితరులు పరిశీలించారు. ఈ ఎగ్జిబిషన్‌లో మద్రాసు ప్రావిన్స్‌కు సంబంధించిన పాత రికార్డులు కూడా చోటచేసుకున్నాయి. అప్పటి మ్యాప్‌లను కూడా ప్రదర్శనకు ఉంచారు. ఇదే విధంగా మెరీనాబీచ్‌లో తమిళనాడు డేను గుర్తు చేసేలా అన్నాదురై ఆకారంతో సైకత శిల్పం ఏర్పాటు చేశారు. ఈ సైకత శిల్పాన్ని మంత్రి దురైమురుగన్‌ తదితరులు సందర్శించారు.

Updated Date - 2022-07-19T15:36:49+05:30 IST