తాంబరం వరకే నాగర్‌కోయిల్‌ Express

ABN , First Publish Date - 2022-01-18T16:21:55+05:30 IST

ప్రతి గురువారం సాయంత్రం 6.55 గంటలకు ఎగ్మూర్‌లో బయలుదేరే ఎగ్మూర్‌ - నాగర్‌కోయిల్‌ వీక్లీ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12667) ఈ నెల 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24, మార్చి 3 తేదీల్లో తాంబరం నుంచి రాత్రి 7.30

తాంబరం వరకే నాగర్‌కోయిల్‌ Express

చెన్నై: ప్రతి గురువారం సాయంత్రం 6.55 గంటలకు ఎగ్మూర్‌లో బయలుదేరే ఎగ్మూర్‌ - నాగర్‌కోయిల్‌ వీక్లీ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12667) ఈ నెల 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24, మార్చి 3 తేదీల్లో తాంబరం నుంచి రాత్రి 7.30 గంటలకు బయలుదేరనుంది. అదే విధంగా ప్రతి శుక్రవారం సాయంత్రం 4.15 గంటలకు నాగర్‌కోయిల్‌లో బయలుదేరే నాగర్‌కోయిల్‌ - ఎగ్మూర్‌ వీక్లీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12668) ఈ నెల 21, 28, ఫిబ్రవరి 4, 11, 18, 25 తేదీల్లో తాంబరం స్టేషన్‌ వరకే వస్తుంది. తాంబరం - ఎగ్మూరు మార్గంలో మరమ్మతుల కారణంగా ఈ రైలును తాంబరం నుంచి నడుపుతున్నట్లు దక్షిణరైల్వే విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

Read more