ఇజ్రాయెల్ దాడుల్లో ముగ్గురు సిరియన్ల మృతి

ABN , First Publish Date - 2022-02-24T19:53:44+05:30 IST

సిరియాలోని రాజధాని డమాస్కస్ సమీపంలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు సిరియన్ సైనికులు మృతి చెందినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా వెల్లడించింది. గురువారం ఉదయం ఈ దాడులు జరిగాయి.

ఇజ్రాయెల్ దాడుల్లో ముగ్గురు సిరియన్ల మృతి

సిరియాలోని రాజధాని డమాస్కస్ సమీపంలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు సిరియన్ సైనికులు మృతి చెందినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా వెల్లడించింది. గురువారం ఉదయం ఈ దాడులు జరిగాయి. సిరియాపై ఇజ్రాయెల్ దాడి చేయడం ఈ నెలలో ఇది నాలుగోసారి. సిరియాలోని ఇరాన్ అనుకూల సైన్యానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ఈ దాడులు చేస్తోంది. సిరియాలో లక్ష్యంగా చేసుకున్న స్థావరాలపై ఇరాన్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. అయితే, తమ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ డిఫెన్స్ వ్యవస్థ, ఇజ్రాయెల్ దాడుల్ని తిప్పికొట్టిందని సిరియా ప్రకటించింది. 2011లో సిరియన్ సివిల్ వార్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు వందలసార్లు ఇజ్రాయెల్ ఆ దేశంపై దాడి చేసింది. అయితే, ఈ దాడులపై ఇజ్రాయెల్ పెద్దగా స్పందించదు.

Read more