Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ సిధ్రా బ్రిడ్జి వద్ద పేలుడు

ABN , First Publish Date - 2022-12-07T05:14:43+05:30 IST

జమ్మూకశ్మీరులో మంగళవారం రాత్రి పేలుడు సంభవించింది. సిధ్రా(Jammu And Kashmir) వంతెన వద్ద...

Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ సిధ్రా బ్రిడ్జి వద్ద పేలుడు
Jammu Suspected Blast

జమ్మూ: జమ్మూకశ్మీరులో మంగళవారం రాత్రి పేలుడు సంభవించింది. జమ్మూ నగర సమీపంలోని సిధ్రా(Jammu And Kashmir) వంతెన వద్ద అనుమానాస్పద పేలుడు ఘటన సంభవించిందని జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు.(Suspected Blast) పేలుడు ఘటన అనంతరం అప్రమత్తమైన పోలీసులు సిధ్రా వంతెన(Sidhra Bridge) వద్ద తనిఖీలు చేస్తున్నారు. పేలుడు ఘటనకు కారణాలపై తాము సోదాలు జరుపుతున్నామని జమ్మూ సీనియర్ ఎస్పీ చందన్ కోహ్లి చెప్పారు. పేలుడు ఘటన జమ్మూలో కలకలం రేపింది. ఈ పేలుడు ఘటనకు పాల్పడ్డ వారు ఎవరనేది పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

Updated Date - 2022-12-07T05:14:45+05:30 IST