కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌గా సురేశ్‌ పటేల్‌

ABN , First Publish Date - 2022-08-04T11:01:27+05:30 IST

కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌(సీవీసీ)గా సురేశ్‌ ఎన్‌.పటేల్‌ నియమితులయ్యారు. ఏడాది కాలంగా సీవీసీ పదవి ఖాళీగా ఉంది.

కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌గా సురేశ్‌ పటేల్‌

విజిలెన్స్‌ కమిషనర్లుగా అరవింద్‌ కుమార్‌, ప్రవీణ్‌ కుమార్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 3: కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌(సీవీసీ)గా సురేశ్‌ ఎన్‌.పటేల్‌ నియమితులయ్యారు. ఏడాది కాలంగా సీవీసీ పదవి ఖాళీగా ఉంది. ఈ ఏడాది జూన్‌ నుంచి ఆయనే తాత్కాలిక సీవీసీగా వ్యవహరిస్తున్నారు. బుధవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో సీవీసీగా ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ హాజరయ్యారు. తర్వాత సీవీసీ పటేల్‌ కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ కార్యాలయంలో ఇంటెలిజెన్స్‌ బ్యూరో మాజీ చీఫ్‌ అరవింద్‌ కుమార్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ శ్రీవాస్తవలతో విజిలెన్స్‌ కమిషనర్లు ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో సీవీసీలో మొత్తం(మూడు) నియామకాలు పూర్తయ్యాయి. 

Updated Date - 2022-08-04T11:01:27+05:30 IST