వ్యాక్సిన్ తప్పనిసరి చేసే అధికారం మీకు లేదు
ABN , First Publish Date - 2022-01-15T08:22:04+05:30 IST
వ్యాక్సిన్ తీసుకోవాలని అనడం లేదంటే వారానికోసారి టెస్ట్ చేయించుకోవడం, పని ప్రదేశంలో మాస్కు వాడటాన్ని తప్పనిసరి చేసే అధికారం ప్రభుత్వానికి లేదని బైడెన్ సర్కారుకు...
బైడెన్ సర్కారుకు షాకిచ్చిన యూఎస్ సుప్రీం కోర్టు
వాషింగ్టన్, జనవరి 14 : వ్యాక్సిన్ తీసుకోవాలని అనడం లేదంటే వారానికోసారి టెస్ట్ చేయించుకోవడం, పని ప్రదేశంలో మాస్కు వాడటాన్ని తప్పనిసరి చేసే అధికారం ప్రభుత్వానికి లేదని బైడెన్ సర్కారుకు అమెరికా సుప్రీం కోర్టు చెప్పింది. నిబంధన పెట్టాలని భావిస్తే 100 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న అన్ని సంస్థల్లోనూ అమలు చేయాలని సూచించింది. హెల్త్ కేర్ సర్వీసులో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయడంపై కోర్టు ఆమోదం తెలిపింది. కోర్టు ఆదేశాలపై బైడెన్ అసహనం వ్యక్తం చేశారు.