Supreme Court : సుప్రీంకోర్టు ఆర్టీఐ పోర్టల్ ప్రారంభం

ABN , First Publish Date - 2022-11-24T20:08:03+05:30 IST

సుప్రీంకోర్టు సమాచారాన్ని ఆన్‌లైన్‌లో తెలుసుకోవడానికి ప్రజలకు ఉపయోగపడే పోర్టల్‌‌ను గురువారం

Supreme Court : సుప్రీంకోర్టు ఆర్టీఐ పోర్టల్ ప్రారంభం
Supreme Court

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు సమాచారాన్ని ఆన్‌లైన్‌లో తెలుసుకోవడానికి ప్రజలకు ఉపయోగపడే పోర్టల్‌‌ను గురువారం ఆవిష్కరించారు. సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసి, సమాచారాన్ని పొందడానికి ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. న్యాయశాస్త్ర విద్యార్థులు ఆకృతి అగర్వాల్, లక్ష్య పురోహిత్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud), జస్టిస్ హిమ కొహ్లీ, జస్టిస్ జేబీ పర్దీవాలా ధర్మాసనం ఈ వివరాలను తెలిపింది.

సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు (Supreme Court) సమాచారాన్ని ఆన్‌లైన్ ద్వారా తెలుసుకునేందుకు ఆర్టీఐ పోర్టల్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. దీనిలో ఏదైనా సమస్య తలెత్తితే తనను సంప్రదించవచ్చునని చెప్పారు.

నవంబరు 11న జరిగిన విచారణ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ, ఈ పోర్టల్ సిద్ధంగా ఉందని, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. సమాచార హక్కు చట్టం క్రింద దరఖాస్తులకు సుప్రీంకోర్టు ఇచ్చే సమాధానాలు దీనిలో ఉంటాయి. ఇప్పటి వరకు ఈ సమాధానాలను తపాలా (పోస్ట్) ద్వారా పంపించేవారు.

Updated Date - 2022-11-24T20:08:13+05:30 IST