చంద్రుడిని ఢీ కొట్టిన రాకెట్‌ శకలాలు8 చైనావే: పరిశోధకులు

ABN , First Publish Date - 2022-03-05T07:54:24+05:30 IST

చంచంద్రుడిని రాకెట్‌ ఢీ కొట్టనుందని గత కొన్ని రోజులుగా పరిశోధకులు చెబుతున్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది..

చంద్రుడిని ఢీ కొట్టిన రాకెట్‌ శకలాలు8 చైనావే: పరిశోధకులు

కేప్‌ కనవెరల్‌, మార్చి 4: చంచంద్రుడిని రాకెట్‌ ఢీ కొట్టనుందని గత కొన్ని రోజులుగా పరిశోధకులు చెబుతున్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. సుమారు 3 టన్నుల బరువైన రాకెట్‌ శకలాలు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.55 గంటలకు చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టాయి. ఢీ కొట్టిన ప్రదేశం భూమికి ఎప్పుడూ కనిపించని రెండోవైపు ఉపరితలంపై ఉందని ఖగోళ పరిశోధకులు తెలిపారు. లక్షల సంవత్సరాలుగా అనేక గ్రహశకలాలను తట్టుకుంటున్న చంద్ర ఉపరితలంపై ఈ రాకెట్‌ కూలిన ప్రభావం నామమాత్రమే కానీ ఈ ఘటనలో క్రోడీకరించిన సమాచారంతో చంద్రుడిని మరింతగా లోతుగా అధ్యయనం చేయొచ్చని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. హెర్ట్‌స్ప్రంగ్‌ బిలానికి 570 కిలోమీటర్ల దూరంలో రాకెట్‌ కూలిన చోట చిన్న బిలం ఏర్పడవచ్చని సైంటిఫిక్‌ అమెరికన్‌ పత్రిక అంచనా వేసింది. తొలుత ఇది ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ రాకెట్‌ అని భావించారు. అయితే.. రాకెట్‌ స్పెక్ట్రమ్‌ పరిశీలన ఆధారంగా ఆ శకలాలు చైనాకు చెందిన చాంగ్‌ ఈ 5-టీ రాకెట్‌వేనని పరిశోధకులు చెబుతున్నారు. చైనా ఆ వార్తలను ఖండించింది. శకలాలు తమ రాకెట్‌వి కాదని, తాము ప్రయోగించిన రాకెట్‌ అంతరిక్షంలోకి ప్రవేశించి మండిపోయిందని వివరణ ఇస్తోంది. ఈ ఘటనపై పరిశోధన చేస్తున్న అమెరికాలోని అరిజోనా వర్సిటీ బృందానికి అమెరికాలోని భారతీయుడు విష్ణురెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. శకలాలు చైనా రాకెట్‌వే అని అన్నారు.

Updated Date - 2022-03-05T07:54:24+05:30 IST