తమిళనాడు మంత్రిగా స్టాలిన్‌ తనయుడు

ABN , First Publish Date - 2022-12-15T03:12:06+05:30 IST

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తనయుడు, డీఎంకే యువజన విభాగ కార్యదర్శి ఉదయనిధి మంత్రిగా

తమిళనాడు మంత్రిగా స్టాలిన్‌ తనయుడు

ఇకపై సినిమాల్లో నటించబోనని ఉదయనిధి ప్రకటన

చెన్నై, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తనయుడు, డీఎంకే యువజన విభాగ కార్యదర్శి ఉదయనిధి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఆయనతో ప్రమాణం చేయించారు. అన్నాడీఎంకే, బీజేపీ మినహా ఇతర పార్టీల నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉదయనిధికి యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధిశాఖను కేటాయించారు. ప్రమాణస్వీకారం అనంతరం ఉదయనిధి తాత కరుణానిధి సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. తర్వాత సచివాలయానికి వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఉదయనిధి మాట్లాడుతూ ఇక తాను సినిమాల్లో నటించబోనని ప్రకటించారు.

Updated Date - 2022-12-15T03:12:07+05:30 IST