కత్తితో పొడిచి.. చేతులు కట్టేసి భూమిలో పాతేసి

ABN , First Publish Date - 2022-10-24T02:53:51+05:30 IST

ఆ దంపతులిద్దరూ కొరియాకు చెందిన వారు. అమెరికాలో స్థిరపడ్డారు. విడిపోవాలనుకున్నారు.

 కత్తితో పొడిచి.. చేతులు కట్టేసి భూమిలో పాతేసి

వాషింగ్టన్‌లో భార్యపై భర్త ఘాతుకం

ఎలాగోలా బయటపడ్డ భార్య

వాషింగ్టన్‌, అక్టోబరు 23: ఆ దంపతులిద్దరూ కొరియాకు చెందిన వారు. అమెరికాలో స్థిరపడ్డారు. విడిపోవాలనుకున్నారు. స్థిర, చరాస్తుల పంపకంలో తేడాలొచ్చాయి. అంతే.. 53 ఏళ్ల ఛేక్యాంగ్‌ ఆన్‌ తన భార్య యాంగ్‌ సూక్‌ ఆన్‌(42)పై కత్తితో దాడి చేశాడు. ఆమె చేతులను, కాళ్లను డక్ట్‌టే్‌పతో కట్టేశాడు. కారులో తీసుకెళ్లి, ఓ నిర్మానుష్య ప్రదేశంలో గొయ్యి తవ్వి, సజీవంగా పూడ్చే యత్నం చేశాడు. ఆ క్రమంలో బురద మట్టిని ఆమెపై వేసి, పారిపోయాడు. బాధితురాలు ఎలాగోలా ఆ గొయ్యి నుంచి బయటపడి.. అరగంట పాటు పరుగెత్తింది. సమీపంలో ఇల్లు కనిపించడంతో వారికి విషయం చెప్పింది. వారు 911కు ఫోన్‌ చేయడంతో పోలీసులు అక్కడకు చేరుకుని, బాధితురాలి వాంగ్మూలాన్ని సేకరించారు.

Updated Date - 2022-10-24T03:03:07+05:30 IST