Special trains: చెన్నై నుంచి షిమోగాకు ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2022-12-20T09:19:08+05:30 IST

ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా షిమోగా టౌన్‌ - చెన్నై సెంట్రల్‌(Shimoga Town - Chennai Central) మధ్య

Special trains: చెన్నై నుంచి షిమోగాకు ప్రత్యేక రైళ్లు

చెన్నై, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా షిమోగా టౌన్‌ - చెన్నై సెంట్రల్‌(Shimoga Town - Chennai Central) మధ్య ప్రత్యేక బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడపనున్నట్లు దక్షిణ రైల్వే సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. వివరాలిలా...

- 06223 నెంబరుగల ఎక్స్‌ప్రెస్‌ జనవరి 1, 3, 8, 10, 15, 17, 22, 24, 29, 31, ఫిబ్రవరి 5, 7, 12, 14, 19, 21, 26, 28, మార్చి 5, 7, 12, 14, 19, 21, 26, 28, తేదీల్లో సాయంత్రం 7 గంటలకు షిమోగా టౌన్‌లో బయలుదేరి మరునాడు ఉదయం 11.10 గంటలకు చెన్నై సెంట్రల్‌ చేరుకుంటుంది.

- 06224 నెంబరు గల ఎక్స్‌ప్రెస్‌ జనవరి 2, 4, 9, 11, 16, 18, 23, 25, 30, ఫిబ్రవరి 1, 6, 8, 13, 15, 20, 22, 27, మార్చి 1, 6, 8, 13, 15, 20, 22, 27, 29 తేదీల్లో సాయంత్రం 3.50 గంటలకు చెన్నై సెంట్రల్‌లో బయలుదేరి మరునాడు ఉదయం 7.55 గంటలకు షిమోగా టౌన్‌ చేరుకోనుంది.

హుబ్లీ-రామేశ్వరం మధ్య వీక్లీ స్పెషల్‌

హుబ్లీ-రామేశ్వరం మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణరైల్వే నిర్ణయించింది. వివరాలిలా ...

- 07355 నెంబరు ఎక్స్‌ప్రెస్‌ జనవరి 7, 14, 21, 28, ఫిబ్రవరి 4, 11, 18, 25, మార్చి 4, 11, 18, 25 తేదీల్లో ఉదయం 6.30 గంటలకు హుబ్లీలో బయలుదేరి మరునాడు ఉదయం 6.15 గంటలకు రామేశ్వరం చేరుకుంటుంది.

- 07356 నెంబరు గల ఎక్స్‌ప్రెస్‌ జనవరి 8, 15, 22, ఫిబ్రవరి 5, 12, 19, 26, మార్చి 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 9 గంటలకు రామేశ్వరంలో బయలుదేరి మరునాడు సాయంత్రం 7.25 గంటలకు హుబ్లీ చేరుకుంటుంది.

Updated Date - 2022-12-20T09:19:10+05:30 IST