Special trains: తిరుచ్చి-అహ్మదాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2022-12-09T09:06:18+05:30 IST

ప్రయాణీకుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు తిరుచ్చి - అహ్మదాబాద్‌(Trichy - Ahmedabad) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణరైల్వే ప్రక

Special trains: తిరుచ్చి-అహ్మదాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లు

చెన్నై, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ప్రయాణీకుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు తిరుచ్చి - అహ్మదాబాద్‌(Trichy - Ahmedabad) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. 1 ఏసీ టూటైర్‌, 5 ఏసీ త్రీటైర్‌, 12 స్లీపర్‌ క్లాస్‌, 4 జనరల్‌ క్లాస్‌, 2 జనరల్‌ క్లాస్‌, లగేజ్‌ కం బ్రేక్‌ బోగీలున్న ఈ రైళ్లు వడోదర, సూరత్‌, వాపి, వసై రోడ్‌, కల్యాణ్‌, పునే, షోలాపూర్‌, కలబుగ్గి, వాడి, రాయచూర్‌, మంత్రాలయం, గుంతకల్‌, తాడిపత్రి, కడప, రేణిగుంట, అరక్కోణం, పెరంబూర్‌, ఎగ్మూర్‌, తాంబరం, చెంగల్పట్టు, విల్లుపురం, కడలూర్‌ పోర్ట్‌, చిదంబరం, శీర్గాళి, వైదీశ్వరన్‌కోయిల్‌, మైలాడుదురై, కుంభకోణం, పాపనాశం, తంజావూర్‌ స్టేషన్లలో ఆగుతాయి. శుక్రవారం నుంచి ఈ రైళ్లకు రిజర్వేషన్‌ కూడా చేసుకోవచ్చు. ప్రత్యేక రైళ్ల తేదీల వివరాలిలా వున్నాయి... - 09419 నెంబరు రైలు ఈ నెల 22, 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో ఉదయం 9.30 గంటలకు అహ్మదాబాద్‌లో బయలుదేరి మూడవ రోజు వేకువజామున 3.45 గంటలకు తిరుచ్చి చేరుకుంటుంది.

- 09420 నెంబరు రైలు ఈ నెల 25, జనవరి 1, 8, 15, 22, 29 తేదీల్లో ఉదయం 5.45 గంటలకు బయలుదేరి మరునాడు రాత్రి 9.15 గంటలకు అహ్మదాబాద్‌ చేరుకుంటుంది.

Updated Date - 2022-12-09T09:06:20+05:30 IST