నేషనల్‌ హెరాల్డ్‌ వ్యవహారంలో త్వరలో ఈడి ముందుకు Sonia

ABN , First Publish Date - 2022-06-09T02:19:38+05:30 IST

Delhi : నేషనల్‌ హెరాల్డ్‌ వ్యవహారంలో ఈడి ఎదుట విచారణకు హాజరు కావాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్‌ గాంధీ నిర్ణయించుకున్నారు. అయితే

నేషనల్‌ హెరాల్డ్‌ వ్యవహారంలో త్వరలో ఈడి ముందుకు Sonia

Delhi : నేషనల్‌ హెరాల్డ్‌ వ్యవహారంలో ఈడి ఎదుట విచారణకు హాజరు కావాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్‌ గాంధీ నిర్ణయించుకున్నారు. అయితే విచారణకు హజరయ్యేందుకు తనకు మూడు వారాల సమయం ఇవ్వాలని సోనియా గాంధీ ఈడిని కోరినట్లు సమాచారం. వాస్తవానికి బుధవారం ఈడి ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉన్నా... కరోనా పాజిటివ్‌ కారణంగా సోనియా గాంధీ హోం క్వారంటైన్‌లో ఉన్నారు. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా.. మూడు వారాల సమయం ఇవ్వాలని కోరారు. మరోవైపు... ఈనెల 13న ఈడి విచారణకు హాజరుకావాలని  సోనియా గాంధీ తనయుడు రాహుల్‌ గాంధీ నిర్ణయించారు. ఇదే విషయంపై చర్చించేందుకు గురువారం కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. రాహుల్‌ ఈడి ఎదుట విచారణకు హాజరైన రోజు దేశ వ్యాప్తంగా భారీగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించే యోచనలో కాంగ్రెస్‌ పార్టీ ఉన్నట్టు సమాచారం.  

Updated Date - 2022-06-09T02:19:38+05:30 IST