National Herald Caseలో సోనియా, రాహుల్‌కు ED నోటీసులు

ABN , First Publish Date - 2022-06-01T19:19:44+05:30 IST

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు జారీ చేసింది.

National Herald Caseలో సోనియా, రాహుల్‌కు ED నోటీసులు

న్యూఢిల్లీ: National Herald అవినీతి కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. రాహుల్ ఈ నెల 2న, సోనియా ఈ నెల 8న తమ ఎదుట హాజరుకావాలంటూ ఈడీ సమన్లు పంపింది. అయితే రాహుల్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారని ఈ నెల 5న హాజరయ్యేందుకు అనుమతినవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఈడీని కోరింది. మరోవైపు ఈడీ నోటీసులపై కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జెవాలా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ.. ప్రజా వ్యతిరేక ఉద్యమ స్వరాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మోడీ పెంపుడు సంస్థగా ఈడీ పనిచేస్తోందన్నారు. తమ నేతలకు నోటీసులు ఇవ్వదాన్ని సరికొత్త పిరికిపంద చర్య అని సుర్జేవాలా వ్యాఖ్యానించారు. 


కాంగ్రెస్ పార్టీకి నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న 90.25 కోట్ల రూపాయలను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు కేవలం 50 లక్షల రూపాయల చెల్లింపుతో యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గతంలో ఆరోపించారు. సోనియా, రాహుల్ నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్ని ఆయాచితంగా పొందారని కూడా స్వామి గతంలో ఆరోపించారు. 

Updated Date - 2022-06-01T19:19:44+05:30 IST