సీబీఐకి సోనాలీ ఫోగట్‌ మృతి కేసు

ABN , First Publish Date - 2022-09-13T10:14:03+05:30 IST

బీజేపీ నేత సోనాలీ ఫోగట్‌ అనుమానాస్పద మృతి కేసును కేంద్ర హోం శాఖ, కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు అప్పగించింది.

సీబీఐకి సోనాలీ ఫోగట్‌ మృతి కేసు

హిసార్‌, సెప్టెంబరు 12: బీజేపీ నేత సోనాలీ ఫోగట్‌ అనుమానాస్పద మృతి కేసును కేంద్ర హోం శాఖ, కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు అప్పగించింది. ఈ మేరకు సిఫారసు చేస్తూ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ లేఖ రాయడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రం నిర్ణయాన్ని ఫోగట్‌ కుటుంబీకులు స్వాగతించారు. సంస్థ ఈ విషయంలో లోతుగా పరిశోధన చేస్తుందని ఆశిస్తున్నట్లు ఆమె సోదరుడు రింకూ ఫోగట్‌ తెలిపారు. గత నెలలో గోవా పర్యటనలో ఉన్న సమయంలో 22 రాత్రి వేళ సోనాలీ ఫోగట్‌ అనుమానస్పద రీతిలో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. 

Read more