Snake: బావిలో భారీ సర్పం

ABN , First Publish Date - 2022-09-13T16:04:39+05:30 IST

కృష్ణగిరి జిల్లా కావేరిపట్నం సమీపంలో పంటపొలంలోని బావిలో పడిన కొండచిలువను కాపాడేందుకు ప్రయత్నించిన వ్యక్తి ఆ దానికి చిక్కి ఊపిరాడక

Snake: బావిలో భారీ సర్పం

                               - రక్షించేందుకు వెళ్లి ఒకరి దుర్మరణం


చెన్నై, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కృష్ణగిరి జిల్లా కావేరిపట్నం సమీపంలో పంటపొలంలోని బావిలో పడిన కొండచిలువను కాపాడేందుకు ప్రయత్నించిన వ్యక్తి ఆ దానికి చిక్కి ఊపిరాడక మృతి చెందారు. కావేరిపట్నం సమీపం మేల్‌కొట్టాయ్‌ ప్రాంతానికి చెందిన చిన్నసామి అనే రైతుకు చెందిన పొలంలోని బావిలో వారం రోజుల క్రితం ఓ కొండ చిలువ జారి పడింది. దానిని కాపాడేందుకు సోమవారం ఉదయం నటరాజన్‌ అనే వ్యక్తి బావిలోకి దిగాడు. దానిని భుజంపై మోసుకుని బావి నుంచి సగం ఎత్తుకు చేరుకున్న నటరాజన్‌(Natarajan) దాని బరువును తట్టుకోలేక జారి బావిలో పడ్డాడు. బావినీటిలో పడిన అతడిని కొండచిలువ తోకతో బంధించింది. దీంతో చిన్నసామి భయంతో కేకలు వేయడంతో చుట్టుపక్కల పొలం పనులు చేస్తున్న వారంతా బావి వద్దకు పరుగెత్తుకొచ్చారు. అప్పటికే ఆ కొండచిలువ నటరాజన్‌ను చుట్టేసింది. దీంతో భీతిల్లిన కార్మికులు అగ్నిమాపక దళానికి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన అక్కడి చేరుకుని కొండచిలువ బంధంలో చిక్కుకున్న నటరాజన్‌ను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కాసేపటికి ఆ కొండచిలువ పట్టుసడలించడంతో ఆయన శవమై నీటిపై తేలాడు. అగ్నిమాపక సిబ్బంది మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు.  

Updated Date - 2022-09-13T16:04:39+05:30 IST