Jammu: ఒకే ఇంట్లో ఆరు మృతదేహాలు లభ్యం
ABN , First Publish Date - 2022-08-17T16:29:24+05:30 IST
జమ్మూకశ్మీరులోని(Jammu and Kashmir) ఓ ఇంట్లో బుధవారం ఉదయం ఆరుగురి మృతదేహాలు లభించడం సంచలనం రేపింది....

జమ్మూ: జమ్మూకశ్మీరులోని(Jammu and Kashmir) ఓ ఇంట్లో బుధవారం ఉదయం ఆరుగురి మృతదేహాలు లభించడం సంచలనం రేపింది.జమ్మూ నగరంలోని సింద్రా ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లీ, ఇద్దరు కుమార్తెలతో కలిసి మొత్తం ఆరుగురి మృతదేహాలు లభించాయి.(family found dead under suspicious circumstances) ఒక ఇంట్లో ఆరుగురి మృతదేహాలున్నాయనే సమాచారం మేర జమ్మూ పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. మరణించిన(dead) వారిలో సకీనా బేగం, ఆమె ఇద్దరు కూతుళ్లు నసీమా అఖ్తర్, రుబీనా బానో, కుమారుడు జఫర్ సలీం, మరో ఇద్దరు బంధువులు నూరుల్ హబీబ్, సజాద్ అహ్మద్ లున్నారు.
వారి మరణానికి కారణాలు తెలియదని, పోస్టుమార్టం రిపోర్టులో వాస్తవాలు వెలుగుచూస్తాయని పోలీసులు చెప్పారు. ఒకే ఇంట్లో ఆరుగురు అనుమానాస్పద స్థితిలో మరణించారని(cause of the death is not known)పోలీసులు వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.