అమెరికాలో కాల్పుల కలకలం.. ఆరుగురి మృతి
ABN , First Publish Date - 2022-04-04T09:45:28+05:30 IST
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడి ఆరుగురి ప్రాణాలు తీశారు.
కాలిఫోర్నియా, ఏప్రిల్ 3: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడి ఆరుగురి ప్రాణాలు తీశారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాలిఫోర్నియా రాజధాని శాక్రమెంటోలో ఎల్లప్పుడూ రద్దీగా ఉండే ‘గోల్డెన్ వన్ సెంటర్’సమీపంలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.