Maharashtra Political Crisis: ఆ 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సిద్ధమైన శివసేన

ABN , First Publish Date - 2022-06-24T03:22:36+05:30 IST

మహారాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడింది. పార్టీ సమావేశానికి హాజరుకాని 12 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని

Maharashtra Political Crisis: ఆ 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సిద్ధమైన శివసేన

ముంబై: మహారాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడింది. పార్టీ సమావేశానికి హాజరుకాని 12 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ డిప్యూటీ స్పీకర్‌కు లేఖ శివసేన (Shiv Sena) లేఖ పంపింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నివాసం మాతోశ్రీలో నేటి సాయంత్రం జరిగిన సమావేశానికి మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సమావేశానికి హాజరు కాని వారిపై చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలుస్తోంది.


మరోవైపు, గువాహటిలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde)ను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యేలు తనను వారి నేతగా ఎన్నుకున్న అనంతరం  షిండే మాట్లాడుతూ తమ నిర్ణయానికి బీజేపీ మద్దతు ఉందని, అవసరమైనప్పుడు ఆ పార్టీ తమకు మద్దతు ఇస్తుందని అన్నారు.  



Updated Date - 2022-06-24T03:22:36+05:30 IST