తిరుగుబాటు నేత Eknath Shindeతోపాటు రెబల్ ఎమ్మెల్యేలపై ఉద్ధవ్ సస్పెన్షన్ వేటు

ABN , First Publish Date - 2022-07-02T12:41:58+05:30 IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణస్వీకారం చేసిన ఒక రోజు తర్వాత, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు...

తిరుగుబాటు నేత Eknath Shindeతోపాటు రెబల్ ఎమ్మెల్యేలపై ఉద్ధవ్ సస్పెన్షన్ వేటు

ముంబయి(మహారాష్ట్ర): మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణస్వీకారం చేసిన ఒక రోజు తర్వాత, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆ రెబల్ ఎమ్మెల్యేను పార్టీ పదవుల నుంచి శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే తొలగించారు.బీజేపీ మద్దతుతో మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఏక్‌నాథ్ షిండేను పార్టీ అన్ని పదవుల నుంచి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం రాత్రి తొలగించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు షిండేను తొలగించినట్లు శివసేన ఒక ప్రకటనలో తెలిపింది.మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణస్వీకారం చేశారు. మహా వికాస్ అఘాడి ప్రభుత్వం పతనం తర్వాత 24 గంటల్లో శివసేన పార్టీ రెబల్స్ పై సస్పెన్షన్ వేటు వేసింది.


 దక్షిణ ముంబైలోని రాజ్‌భవన్‌లో షిండే,ఫడ్నవీస్‌లు సీఎం, డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేశారు.నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన షిండే థానే జిల్లాలో తన రాజకీయ గురువు, దివంగత శివసేన నాయకులు బాల్ థాకరే, ఆనంద్ డిఘేలకు నివాళులర్పించారు. కొత్త ప్రభుత్వం తమ మెజారిటీని నిరూపించుకునేందుకు వీలుగా జులై 2 నుంచి మహారాష్ట్ర శాసనసభ రెండు రోజుల ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది.


Updated Date - 2022-07-02T12:41:58+05:30 IST