Jammu and Kashmirలో కూలిపోయిన సొరంగం
ABN , First Publish Date - 2022-05-20T12:55:02+05:30 IST
జమ్మూకశ్మీరులోని రాంబన్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.రాంబన్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో కొంత భాగం కుప్పకూలిపోయింది....

శిథిలాల్లో ఏడుగురు చిక్కుకున్నారని అనుమానం
రాంబన్: జమ్మూకశ్మీరులోని రాంబన్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.రాంబన్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో కొంత భాగం కుప్పకూలిపోయింది. ఈ సొరంగంలో ఏడుగురు కూలీలు చిక్కుకున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. రాంబన్ జిల్లాలోని మేకర్కోట్ ప్రాంతంలోని ఖూని నాలా వద్ద నిర్మాణంలో ఉన్న సొరంగంలో కొంత భాగం కూలిపోవడంతో పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ను చేపట్టారు. కూలిన సొరంగంలో ఏడుగురు కూలీలున్నారని వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిలోని ఖూని నాలా వద్ద సొరంగం నిర్మిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఓ కూలీని పోలీసులు రక్షించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని రాంబన్ డిప్యూటీ కమిషనర్ చెప్పారు.ప్రస్తుతం కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ కారణంగా జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని తాత్కాలికంగా మూసివేశారు.