Delhi గోకుల్‌పురిలో ఘోర అగ్నిప్రమాదం...ఏడుగురి సజీవ దహనం
ABN , First Publish Date - 2022-03-12T15:24:16+05:30 IST
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని గోకుల్‌పురి ప్రాంతంలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది....

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని గోకుల్‌పురి ప్రాంతంలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం అయ్యారు.ఈ అగ్నిప్రమాదంలో 30 మురికివాడలు కాలి బూడిదయ్యాయి.శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో గోకుల్‌పురి వాసులు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి అగ్నిప్రమాద ఘటన గురించి తెలిపారు.13 అగ్నిమాపక శకటాలు గోకుల్‌పురిలోని ఘటనా స్థలానికి చేరుకుని కొన్ని గంటల్లో మంటలను ఆర్పివేశాయి.ఈ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలను సీఎం కేజ్రీవాల్ పరామర్శించారు. అగ్నిప్రమాదం వెనుక కారణం ఇంకా తెలియాల్సి ఉంది.