మార్చి 31 వరకు 144 సెక్షన్‌, కర్ఫ్యూ కొనసాగింపు: సర్కారు

ABN , First Publish Date - 2022-02-02T01:17:21+05:30 IST

మార్చి 31 వరకు 144 సెక్షన్‌, కర్ఫ్యూ కొనసాగింపు: సర్కారు

మార్చి 31 వరకు 144 సెక్షన్‌, కర్ఫ్యూ కొనసాగింపు: సర్కారు

గౌతమ్ బుద్ధ నగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. కోవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా కరోనా నిబంధనలను యూపీ సర్కారు కఠినంగా అమలు చేస్తోంది. గౌతమ్ బుద్ధ నగర్‌లో 144 సెక్షన్‌ను మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాత్రి పూట కర్ఫ్యూను కొనసాగిస్తున్నట్లు సర్కారు పేర్కొంది. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను కొనసాగిస్తున్నట్లు అధికారులు చెప్పారు. పెళ్లిళ్లకు 100 మందిని మాత్రమే అనుమతిస్తారని, బహిరంగ ప్రదేశాల్లో 50శాతం మందిని మాత్రమే అనుమతిస్తారని అధికారులు తెలిపారు. రాజకీయ పార్టీలు 50 శాతం సామర్థ్యంతో లేదా గరిష్టంగా 500 మందితో ఇండోర్ సమావేశాలను నిర్వహించవచ్చని అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2022-02-02T01:17:21+05:30 IST