Second airport: కాంచీపురం జిల్లాలో రెండో విమానాశ్రయం?

ABN , First Publish Date - 2022-07-28T14:09:57+05:30 IST

కాంచీపురం జిల్లాలో రెండో విమానాశ్రయాన్ని(Second airport) ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నగరానికి 59 కిలోమీటర్ల

Second airport: కాంచీపురం జిల్లాలో రెండో విమానాశ్రయం?

చెన్నై, జూలై 27 (ఆంధ్రజ్యోతి): కాంచీపురం జిల్లాలో రెండో విమానాశ్రయాన్ని(Second airport) ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నగరానికి 59 కిలోమీటర్ల దూరంలోని పరందూరులోని విమాశ్రయం ఏర్పాటుకు అనువుగా 4500 ఎకరాలున్నట్లు అధికారులు గుర్తించారు. నగరంలోని మీనాంబాక్కం అంతర్జాతీయ, జాతీయ విమానాశ్రయాల్లో రోజురోజుకు దేశవిదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంలో కేంద్ర విమానయాన సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి రెండో విమానాశ్రయం ఏర్పాటుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నాయి. స్థల పరిశీలన కూడా జరిగింది. గత జనవరిలో రెండో విమానాశ్రయం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం(State Govt) నాలుగు ప్రాంతాలను ఎంపిక చేసి ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వ పరిశీలనకు పంపింది. చెన్నై(Chennai)కి సమీపంలోని పరందూరు, పన్నూరు, తిరుప్పోరూరు, పట్టాలం ప్రాంతాలు విమానాశ్రయం ఏర్పాటుకు అనువుగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఇటీవల ఈ నాలుగు ప్రాంతాల్లో పరందూరు, పన్నూరు ప్రాంతాలే విమానాశ్రయం(Airport) ఏర్పాటుకు అనువుగా ఉన్నాయని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాల్లో ఒకదానిని ఎంపిక చేయనున్నారు. పన్నూరు ప్రాంతం మీనంబాక్కం విమానాశ్రయానికి 44 కి.మీ.ల దూరంలో ఉండగా, పరందూరు 59 కిలోమీటర్ల దూరంగా ఉంది. ఈ రెండింటిలో ఎక్కువ దూరంలో ఉన్న పందరూరు ప్రాంతమే రెండో విమానాశ్రయం ఏర్పాటుకు అన్ని విధాల అనువుగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేసింది. ఇటీవల రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి తంగం తెన్నరసు ఢిల్లీలో పౌర విమానాయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య(Jyotiraditya)ను కలుసుకుని ఈ విషయమై చర్చించారు. ఈ అంశంపై తంగం తెన్నరసు మాట్లాడుతూ రెండో గ్రీన్‌ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసేందుకు పన్నూరు, పరందూరు ప్రాంతాల్లో ఒకదానిని ఎంపిక చేసే విషయమై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. 

Updated Date - 2022-07-28T14:09:57+05:30 IST