బెంగాల్లో వెదకండి.. ‘పప్పు’ ఎవరో తెలుస్తుంది
ABN , First Publish Date - 2022-12-16T00:58:47+05:30 IST
దేశంలో పారిశ్రామికోత్పత్తి క్షీణిస్తోంది.. ఆర్థిక వ్యవస్థ నిర్వహణ గాడితప్పింది.. ‘‘ఇప్పుడు పప్పు ఎవరు?’’ అని నిలదీసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా
తృణమూల్ ఎంపీ మహువాకు నిర్మల చురక
న్యూఢిల్లీ, డిసెంబరు 15: దేశంలో పారిశ్రామికోత్పత్తి క్షీణిస్తోంది.. ఆర్థిక వ్యవస్థ నిర్వహణ గాడితప్పింది.. ‘‘ఇప్పుడు పప్పు ఎవరు?’’ అని నిలదీసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ బదులిచ్చారు. గురువారం ఆమె లోక్సభలో మాట్లాడుతూ.. ‘మీ సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్లో వెదకండి.. పప్పు ఎవరో తెలుస్తుంది’ అని సూచించారు. బెంగాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలుచేయకుండా అక్కడి మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఉదహరిస్తూ నిర్మల చురకలంటించారు.