పాఠశాల నీటితొట్టెలో కొండచిలువ

ABN , First Publish Date - 2022-12-02T12:05:05+05:30 IST

పాఠశాలలో కొండ చిలువ(Kondachiluwa) కలకలం రేపింది. రాయచూరు జిల్లాలోని మస్కి తాలూకా అంకుశదొడ్డి గ్రామ పంచాయతీ పరిధిలో

పాఠశాల నీటితొట్టెలో కొండచిలువ

రాయచూరు(బెంగళూరు), డిసెంబరు 1 : పాఠశాలలో కొండ చిలువ(Kondachiluwa) కలకలం రేపింది. రాయచూరు జిల్లాలోని మస్కి తాలూకా అంకుశదొడ్డి గ్రామ పంచాయతీ పరిధిలోని బుద్దిన్నిఎస్‌ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నీటి ట్యాంక్‌(సంప్)లో గురువారం కొండచిలువ ప్రత్యేక్షమైంది. నీళ్లల్లో కొండచిలువ ఉన్నట్లు గుర్తించిన పాఠశాల సిబ్బంది వెంటనే ఎస్‌డీఎంసీ అధ్యక్షుడు నాగరదప్ప దేవరమనికి సమాచారం ఇవ్వగా ఆయన గ్రామ పెద్దలతో కలిసి వెం టనే పాములను పట్టే శాంతయ్య స్వామిని పిలిపించారు. చాకచక్యంగా నీటిలో ఉన్న కొండచిలువను పట్టుకున్న శాంతయ్య స్వామి దాన్ని సమీపంలోని అడవిలో వదిలేశాడు. దీంతో పిల్లలు, సిబ్బంది ఊపిరి పీల్చు కున్నారు.

Updated Date - 2022-12-02T12:05:07+05:30 IST