ఒకసారి ‘ఐ లవ్ యూ’ చెప్పడం లైంగిక వేధింపు కాదు : ముంబై కోర్టు

ABN , First Publish Date - 2022-02-23T22:26:35+05:30 IST

మైనర్ బాలికకు ఒకసారి ‘ఐ లవ్ యూ’ అని చెప్పడం చాలా వరకు

ఒకసారి ‘ఐ లవ్ యూ’ చెప్పడం లైంగిక వేధింపు కాదు : ముంబై కోర్టు

ముంబై : మైనర్ బాలికకు ఒకసారి ‘ఐ లవ్ యూ’ అని చెప్పడం చాలా వరకు ప్రేమ భావనను వ్యక్తం చేయడమవుతుందని ముంబైలోని స్పెషల్ కోర్టు తీర్పు చెప్పింది. ‘ఐ లవ్ యూ’ అని చెప్పి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 22 ఏళ్ళ యువకుడిని నిర్దోషిగా విడుదల చేసింది. నిందితుడు పాల్పడిన ఏ చర్య బాధితురాలి గౌరవ, మర్యాదలకు భంగం కలిగించిందో ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని తెలిపింది. 


లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ చట్టం (పోక్సో) ప్రకారం ఈ కోర్టు ఏర్పాటైంది. నిందితుడు బాధితురాలికి ఎక్కడ ‘ఐ లవ్ యూ’ అని చెప్పాడు? ఇతర వివరాలేమిటి? అనే అంశాలపై  పదిహేడేళ్ళ బాధితురాలు, ఆమె తల్లి ఇచ్చిన వాంగ్మూలాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. ఈ సంఘటన జరిగిన రోజు నిందితుడు ‘ఐ లవ్ యూ’ అని చెప్పాడని బాధితురాలు చెప్పినట్లు గుర్తు చేసింది. నిందితుడు పదే పదే తన వెంటపడి, ‘ఐ లవ్ యూ’ అని చెప్పినట్లు బాధితురాలు చెప్పలేదని పేర్కొంది. ‘ఐ లవ్ యూ’ అని చెప్పిన ఏకైక సంఘటన చాలా వరకు బాధితురాలి పట్ల నిందితుని ప్రేమ భావనను వ్యక్తం చేయడమవుతుందని తెలిపింది. బాధితురాలి గౌరవ, మర్యాదలను అవమానించే ఉద్దేశంతో ఈ చర్యకు పాల్పడినట్లు చెప్పలేమని తెలిపింది. బాధితురాలి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే చర్యకు నిందితుడు పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని తెలిపింది. నిందితుడు లైంగికపరమైన ఉద్దేశంతో బాధితురాలిపట్ల వ్యవహరించినట్లు చెప్పడానికి స్పష్టమైన సాక్ష్యాధారాలను సమర్పించలేదని పేర్కొంది. 


Updated Date - 2022-02-23T22:26:35+05:30 IST