ఈ టాయ్‌లెట్‌తో నీటి పొదుపు!

ABN , First Publish Date - 2022-10-17T08:56:08+05:30 IST

సృజనాత్మకతకు జపనీయులు పెట్టింది పేరు.

ఈ టాయ్‌లెట్‌తో నీటి పొదుపు!

తెలివైన ఆలోచన.. నెటిజన్ల ప్రశంసలు

సృజనాత్మకతకు జపనీయులు పెట్టింది పేరు. ఎప్పుడూ కొత్త ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆకర్షించే ఆ దేశస్థులు చిన్నపాటి మార్పులతో తయారు చేసిన మరుగుదొడ్డి నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. మరుగుదొడ్డిలో ఫ్లష్‌ బాక్సుకు సింకు అమర్చి నీటి పొదుపునకు బాటలు వేశారు. సింక్‌లో చేతులు శుభ్రం చేసుకున్న నీటిని నిల్వ చేసి వాటినే మరుగుదొడ్డి ఫ్లష్‌కు వాడొచ్చని ప్రయోగాత్మకంగా చూపించారు. ఈ ఫొటో ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది. నీరు వృథా కాకుండా పొదుపు చేయడం చిన్న విషయమేమీ కాదు. ఇలా చేయడం వల్ల ఏటా వేలాది లీటర్ల నీటిని ఆదా చేయొచ్చు అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Updated Date - 2022-10-17T08:56:08+05:30 IST