sanjay raut: ఈడీ తాజా సమన్లు.. బుధవారం హాజరు కావాలని ఆదేశం

ABN , First Publish Date - 2022-07-27T03:31:18+05:30 IST

ముంబై: శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ (sanjay raut‌)కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (Enforcement Directorate) అధికారులు తాజాగా సమన్లు జారీ చేశారు. మనీలాండరింగ్‌ కేసులో వాంగ్మూలం నమోదునకు బుధవారం ఉదయం రావాలంటూ సమన్లు పంపారు.

sanjay raut: ఈడీ తాజా సమన్లు.. బుధవారం హాజరు కావాలని ఆదేశం

ముంబై: శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ (sanjay raut‌)కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (Enforcement Directorate) అధికారులు తాజాగా సమన్లు జారీ చేశారు. మనీలాండరింగ్‌ కేసులో వాంగ్మూలం నమోదునకు బుధవారం ఉదయం రావాలంటూ సమన్లు పంపారు.

ముంబైలోని గొరెగావ్‌ ప్రాంతంలో పత్ర చాల్‌(చౌక గృహాలు) పునర్నిర్మాణంలో రూ.1,034 కోట్ల భూ కుంభకోణం, ఇతర ఆర్థిక లావాదేవీల్లో రౌత్‌ భార్య వర్ష, ఆయన సన్నిహితుడు ప్రవీణ్‌ రౌత్‌కు సంబంధించిన రూ.11.15 కోట్ల ఆస్తులను ఈడీ ఇప్పటికే జప్తు చేసింది.

Read more