ఆంక్షలు అన్నారంటే యుద్ధంతో సమానమే: పుతిన్ ఘాటు వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-03-06T03:01:16+05:30 IST

ఉక్రెయిన్‌తో భీకర యుద్ధం జరుగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా సహా పశ్చిమ

ఆంక్షలు అన్నారంటే యుద్ధంతో సమానమే: పుతిన్ ఘాటు వ్యాఖ్యలు

మాస్కో: ఉక్రెయిన్‌తో భీకర యుద్ధం జరుగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా సహా పశ్చిమ దేశాలు తమపై ఆంక్షలు విధించడాన్ని ప్రస్తావిస్తూ.. రష్యాపై ఆంక్షలు విధించడమంటే యుద్ధంతో సమానమేనని వ్యాఖ్యానించారు. నాటో దేశాలు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరికలు జారీ చేశారు.


లక్ష్యం నెరవేరే వరకు యుద్ధం చేస్తామని తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం తొందరపాటుతో తీసుకున్న చర్య కాదని, అన్నీ ఆలోచించే యుద్ధానికి దిగామని పేర్కొన్నారు. ఊహించిన దానికంటే యుద్ధం తీవ్రంగా జరుగుతోందన్నారు.


అసలు ఉక్రెయిన్‌లో అణ్వాయుధాలే లేకుండా చేస్తామని పుతిన్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై జరుగుతున్న దాడులపై స్వదేశంలోనే జరుగుతున్న ఆందోళనపై పుతిన్ మాట్లాడుతూ.. ఆందోళన కట్టడికి దేశంలో మార్షల్ లా విధించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 


అలాగే, ఉక్రెయిన్‌లో నో ఫ్లైజోన్ విధిస్తే తీవ్రపరిణామాలు తప్పవన్నారు. నో ఫ్లైజోన్ విధించిన దేశాలు మాస్కో వివాదంలోకి వచ్చినట్టేనని తేల్చి చెప్పారు. ఆ దేశాలు రష్యాతో ఘర్షణకు సిద్ధపడాల్సి ఉంటుందని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. నో ఫ్లైజోన్ విధించిన దేశాలు యుద్ధంలో పాల్గొంటున్నట్లుగానే పరిగణిస్తామన్నారు.

Updated Date - 2022-03-06T03:01:16+05:30 IST