Azam Khan: దోషిగా తేలిన ఆజంఖాన్.. మూడేళ్ల శిక్ష పడే అవకాశం
ABN , First Publish Date - 2022-10-27T15:13:16+05:30 IST
సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్(Azam Khan)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. విద్వేషపూరిత ప్రసంగం కేసులో
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్(Azam Khan)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. విద్వేషపూరిత ప్రసంగం కేసులో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. మరికాసేపట్లో శిక్ష ఖరారు చేయనుంది. ఆయనపై నమోదైన సెక్షన్ల ప్రకారం గరిష్ఠంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు కనుక ఆజంఖాన్‌కు రెండు నుంచి మూడేళ్లపాటు జైలు శిక్ష విధిస్తే శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోతారు. ఆజంఖాన్‌పై అవినీతి, దొంగతనం సహా దాదాపు 90 కేసులు ఉన్నాయి.
2019లో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అప్పటి కలెక్టర్ ఆంజనేయకుమార్ సింగ్‌పై ఆజంఖాన్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. కాగా, చీటింగ్ కేసులో జైలుకెళ్లిన ఆజంఖాన్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడంతో ఈ ఏడాది మొదట్లో జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన దాదాపు రెండేళ్లపాటు జైలులో గడిపారు.