ద్వారక శారదా పీఠాధిపతిగా సదానంద సరస్వతి

ABN , First Publish Date - 2022-09-13T10:31:33+05:30 IST

ద్వారక శారదా పీఠాధిపతి (శంకరాచార్య) స్వామి స్వరూపానంద సరస్వతి (99) అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేశారు.

ద్వారక శారదా పీఠాధిపతిగా సదానంద సరస్వతి

నర్సింగ్‌పూర్‌ (ఎంపీ), సెప్టెంబరు 12: ద్వారక శారదా పీఠాధిపతి (శంకరాచార్య) స్వామి స్వరూపానంద సరస్వతి (99) అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేశారు. మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్‌ జిల్లాలోని ఆయన ఆశ్రమంలో ఆదివారం మధ్యాహ్నం స్వామి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. సోమవారం అధికారిక లాంఛనాల నడుమ.. శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాల క్రతువును పూర్తిచేశారు. కాగా, ద్వారక శారదా పీఠానికి నూతన అధిపతిగా దండి స్వామి సదానంద సరస్వతి, జ్యోతిష పీఠాధిపతిగా దండి స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి నియమితులయ్యారు. 

Read more